ఒకటి కాదు, 2 పాటలు పెండింగ్

ఆచార్య సినిమాకు సంబంధించి అంతా అనుకుంటున్న మేటర్ ఒకటే. ఈ సినిమాకు సంబంధించి ఒక్క పాట బ్యాలెన్స్ ఉంది. అది కూడా చరణ్-పూజా హెగ్డేపై తీయాల్సిన సాంగ్. ఆ పాట తీసేస్తే సినిమా విడుదలకు సిద్ధమైపోతుంది. సరిగ్గా ఇక్కడే యూనిట్ షాక్ ఇచ్చింది.

ఆచార్య సినిమాకు సంబంధించి ఒకటి కాదు, ఏకంగా రెండు పాటలు పెండింగ్ ఉన్నాయని ప్రకటించింది
యూనిట్. రోజుల తరబడి షూటింగ్ చేస్తున్నప్పటికీ ఇంకా 2 పాటలు పెండింగ్ ఉండడం ఏంటంటూ
ఆశ్చర్యపోతున్నారు జనం. అయితే ఉన్నంతలో గుడ్ న్యూస్ ఏంటంటే.. ఈ సినిమా టాకీ మొత్తం పూర్తయింది.

ఈరోజు ఆచార్య యూనిట్ నుంచి ఈ మేరకు ప్రకటన వచ్చింది. పనిలోపనిగా చిరంజీవి, రామ్ చరణ్
కలిసున్న మరో స్టిల్ ను కూడా రిలీజ్ చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు
ఇంకా విడుదల తేదీ ఫిక్స్ చేయలేదు. సెప్టెంబర్ చివరి వారం లేదా అక్టోబర్ 1న ఈ సినిమాను రిలీజ్
చేయాలని అనుకుంటున్నారు.