ఇందువదన.. మనిషా.. దెయ్యమా?

వరుణ్ సందేశ్ రీంఎంట్రీ ఇస్తున్న సినిమా ఇందువదన. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ గెటప్, స్టోరీ నేపథ్యం అన్నీ కొత్తగా ఉన్నాయి. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాల్ని మరింత పెంచేలా రిలీజైంది టీజర్. ఈరోజు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా ఇందువదన టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజ‌ర్ లాంఛ్ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ ప్ర‌సాద్ లాబ్స్ లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ సినిమాకు కథ, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, బి మ‌ర‌ళికృష్ణ సినిమాటోగ్రాఫి బాధ్య‌త‌లు తీసుకున్నారు.

ఇక టీజర్ విషయానికొస్తే.. హీరోహీరోయిన్ల మధ్య ప్రేమను బలంగా చూపించారు. తను బతికి ఉండగా.. హీరో చనిపోడంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. దీనికితోడు టీజర్ చూస్తుంటే, ఇది పునర్జన్మ కాన్సెప్ట్ తో తీసిన సినిమా అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటివరకు పోస్టర్లలో చూసిన గెటప్స్, స్టిల్స్ అన్నీ గత జన్మకు సంబంధించినవనే విషయం అర్థమౌతోంది.

సినిమాలో వరుణ్ సందేష్ లుక్ బాగుంది. హీరోయిన్ కూడా టీజర్ లో చాలా బాగా చేసింది. ఇక చివర్లో
హీరోయిన్ ను దెయ్యంగా చూపించి దర్శకుడు మరో ట్విస్ట్ ఇచ్చాడు. సినిమాలో ఆమె పూర్తిగా దెయ్యంగా
ఉంటుందా.. లేక మనిషిగానే చూపించారా అనే సస్పెన్స్ రేకెత్తించేలా ఉంది ట్రయిలర్. ప్రస్తుతం పోస్ట్
ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాను త్వరలోనే థియేటర్లలోకి తీసుకొస్తారు.