చిన్న సినిమాకు 600 థియేటర్లు

కరోనా దెబ్బకు పెద్ద సినిమాలన్నీ వాయిదా బాట పడుతుంటే, చిన్న సినిమాలు తెగించి ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే 5 చిన్న సినిమాలు థియేటర్లలోకి రాగా.. ఈ వీకెండ్ ఇంకొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. పెద్ద సినిమాల నుంచి పోటీ లేకపోవడంతో వీటికి పుష్కలంగా థియేటర్లు అందుబాటులోకొచ్చాయి. దీంతో ఓ చిన్న సినిమాకు ఏకంగా 600 థియేటర్లు దొరికాయి.

కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ఎస్ఆర్ కల్యాణమండపం. ఈ
సినిమాను 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 600 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. కిరణ్ అబ్బవరంకు ఇది రెండో సినిమా మాత్రమే. రెండో సినిమాకే ఈ రేంజ్ లో థియేటర్లు దక్కించుకున్నాడు ఈ హీరో.

ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై నూత‌న దర్శ‌కుడు శ్రీధర్ గాదె దర్శకత్వంలో ప్ర‌మోద్, రాజు లు
నిర్మించిన ఈ చిత్రంలో సాయికుమార్ కీలక పాత్ర పోషించారు. ప్రధానంగా సినిమా కిరణ్ అబ్బవరం,
సాయికుమార్ మధ్యే నడుస్తుంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.