రేపు ఏ సినిమా రిలీజ్ అవుతోంది?

రేపు ఏకంగా అరడజను సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో కాస్త బజ్ ఉన్న మూవీస్ రెండు మాత్రమే. పోటీ కూడా వాటి మధ్యే ఉంది. అవే శ్రీదేవి సోడా సెంటర్, ఇచ్చట వాహనములు నిలుపరాదు. సుధీర్ బాబు హీరోగా నటించిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు గట్టిగా ప్రచారం చేశారు. ట్రయిలర్ కూడా బాగుంది. దీనికి తోడు ఆఖరి నిమిషంలో ప్రభాస్ ప్రచారంలోకి దిగాడు. దీంతో సినిమాపై అందరి దృష్టి పడింది.

ఇక సుశాంత్ హీరోగా నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా ట్రయిలర్ కూడా కొత్తగా ఉంది.
దీంతో ఈ సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి. దీనికితోడు సినిమా చాలా బాగుందంటూ దర్శకుడు
త్రివిక్రమ్ చెప్పడం మూవీపై అంచనాలు పెంచింది.

ఈ 2 సినిమాలు తప్ప మిగతా సినిమాలపై పెద్దగా అంచనాల్లేవు. శ్రీనివాసరెడ్డి నటించిన హౌస్ అరెస్ట్ సినిమా వస్తోంది. దీంతో పాటు సూర్యాస్తమయం, గ్రేట్ శంకర్, వివాహభోజనంబు సినిమాలు వస్తున్నాయి. వీటిలో కమెడియన్ సత్య నటించిన వివాహ భోజనంబు సినిమా మాత్రం థియేటర్లలోకి రావడం లేదు. రేపు ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతోంది