కొంతమంది కుప్పిగంతులు వేస్తున్నారు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై మరోసారి స్పందించాడు హీరో మంచు విష్ణు. ఇప్పటికే అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి ప్రకటన వచ్చేసింది. ఎవరు బరిలో నిలుస్తారు, ఎవరు తప్పుకుంటారనే అంశం ప్రస్తుతం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఈ క్రమంలో మంచు విష్ణు మరోసారి తన వైఖరి వెల్లడించాడు.

ఈ సారి ఎన్నికల్లో తప్పకుండా నిలబడతానని స్పష్టంచేశాడు మంచు విష్ణు. మా అసోసియేషన్ కు బిల్డింగ్
కట్టేందుకు తను ఆల్రెడీ స్థలాలు కూడా చూస్తున్నానని తెలిపిన మంచు విష్ణు.. అసోసియేషన్ కు అధ్యక్షుడిగా మారేందుకు తనకు అన్ని అర్హతలు ఉన్నాయంటున్నాడు. కొంతమంది కుప్పిగంతులు వేసినంత మాత్రాన ఇండస్ట్రీ విడిపోదని, అంతా ఒకటేనని అంటున్నాడు ఈ నటుడు.

“మా అసోసియేషన్ అధ్యక్ష పదవికి పూర్తిగా న్యాయం చేస్తాను. ఆ నమ్మకం ఉంది కాబట్టే… నేను ఈసారి
నిలబడుతున్నాను. నాకు తెలిసి ఇండస్ట్రీ ఇప్పటివరకూ డివైడ్‌ అవ్వలేదు. ఏదో ఐదారుగురు కుప్పిగంతులు వేస్తుంటే.. ఇండస్ట్రీ మొత్తం విడిపోయింది అనడం తప్పు. ఎన్నికల వల్ల విడిపోవడం, విడిపోతాం అనడం సరికాదు. అది అసాధ్యం కూడా. ఎన్నికలు కేవలం ఎన్నికలు మాత్రమే.”

ఇలా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై స్పందించాడు మంచు విష్ణు. ఇండస్ట్రీలో చాలా అసోసియేషన్లు ఉన్నాయని.. తెలుగు వాళ్లంతా కలిసి ఒకే అసోసియేషన్ లా ఎందుకు ఉండకూడదని ప్రశ్నిస్తున్నాడు.