నా జీవితం మెగా ఫ్యామిలీతోనే..!

మెగా కాంపౌండ్ కు బండ్ల గణేశ్ కు ఉన్న అవినాభావ సంబంధం గురించి అందరికీ తెలిసిందే. మరీ
ముఖ్యంగా పవన్ కల్యాణ్ కు తాను వీరభక్తుడినని పదేపదే చెప్పుకుంటారు బండ్ల. ఈ క్రమంలో మెగా
ఫ్యామిలీపై తనకున్న అభిమానాన్ని మరోసారి బయటపెట్టారు.

“నాకు రెండోసారి కరోనా వచ్చింది. ఈసారి ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. ఏ హాస్పిటల్ కు ఫోన్ చేసినా ఖాళీ లేదన్నారు. పవన్ కల్యాణ్ కు ఫోన్ చేద్దామంటే ఆయన కరోనా బారిన పడ్డారు. దీంతో ఏం చేయాలో తెలీక చిరంజీవికి కాల్ చేశాను. వెంటనే హాస్పిటల్ బెడ్ ఎరేంజ్ చేసి నా ప్రాణాలు కాపాడారు. అప్పటికే నా
ఊపిరితిత్తులు 80శాతం డ్యామేజ్ అయ్యాయి. చిరంజీవి సహాయం చేయకపోతే ఈరోజు నేను ప్రాణాలతో
ఉండేవాడ్ని కాదు.”

ఇలా చిరంజీవి చేసిన సాయాన్ని గుర్తుచేసుకున్నారు బండ్ల. ఎప్పటికీ తను మెగా కాంపౌండ్ కు
వీరవిధేయుడిగానే ఉంటానని ప్రకటించుకున్నారు. అటు పవన్ కల్యాణ్ తో సినిమాపై స్పందిస్తూ.. పవన్
ఎప్పుడు ఓకే అంటే అప్పుడు తాను సిద్ధంగా ఉన్నానని, కథ-దర్శకుడు లాంటి విషయాల్ని పవన్ కల్యాణే
ఫైనలైజ్ చేస్తారని క్లారిటీ ఇచ్చారు బండ్ల గణేశ్.