అఖిల్ సినిమాకు మరో కొత్త తేదీ

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. బన్నీ వాసు, వాసువర్మ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు తాజాగా మరో రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్.

నిజానికి ఈ ఏడాది ప్రారంభంలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. అంతలోనే కరోనా సెకెండ్ వేవ్
స్టార్ట్ అవ్వడంతో సినిమా వాయిదా పడింది. ఈ గ్యాప్ లో ఓటీటీలోకి కూడా వస్తుందనే ఊహాగానాలు
చెలరేగాయి. ఎట్టకేలకు మేకర్స్ మరో డేట్ ప్రకటించారు. అయితే ఈ తేదీకి సినిమా వస్తుందా అనే
అనుమానాలు ఇప్పట్నుంచే మొదలయ్యాయి.

దేశంలో థర్డ్ వేవ్ భయాలు ముసురుకున్నాయి. సెప్టెంబర్ లో మూడో దశ కరోనా మొదలై, అక్టోబర్ నాటిక పీక్ స్టేజ్ కు చేరుతుందని దాదాపు అన్ని విశ్లేషణ సంస్థలు, అధికారులు చెబుతున్నారు. ఇదే కనుక నిజమైతే.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మరోసారి వాయిదా పడడం ఖాయం. ప్రస్తుతానికైతే అఖిల్ తో పాటు చాలామంది హీరోలు.. తమ సినిమాల విడుదల తేదీలు ప్రకటిస్తున్నారు.