శ్రీదేవి సోడా సెంటర్ ఫస్ట్ డే కలెక్షన్

సుధీర్ బాబు, ఆనంది హీరోహీరోయిన్లుగా నటించిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమా మొదటి రోజు ఓ మోస్తరుగా ఆకట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు కోటి 32 లక్షల రూపాయల షేర్ వచ్చింది. నిజానికి 2 కోట్ల రూపాయల షేర్ అంచనా వేస్తే.. ఓ 60 లక్షలు తగ్గింది. వరల్డ్ వైడ్ చూసుకుంటే, ఈ సినిమాకు రెండున్నర కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.

సెకండ్ వేవ్ తర్వాత ఏ సినిమాకూ పెద్దగా కలెక్షన్లు లేవు. ఎస్ఆర్ కల్యాణమండపం లాంటి సినిమాలు
హిట్టయ్యాయని చెప్పుకున్నప్పటికీ కాస్త నష్టాలతోనే ఫైనల్ రన్ ముగిసింది. ఉన్నంతలో రాజరాజ చోర
సినిమా ఒక్కటే చెప్పుకోదగ్గ రేంజ్ లో వసూళ్లు సాధించింది. ఇప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ కూడా అంచనాల కంటే తక్కువగానే వసూళ్లు సాధించి ట్రేడ్ ను నిరాశపరిచింది.

రాబోయే రోజుల్లో సుధీర్ బాబు సినిమా ఏ రేంజ్ లో వసూళ్లు సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.  ఎందుకంటే, ఈ సినిమాకు అక్కడక్కడ నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎంతమంది థియేటర్లకు వెళ్లి సినిమా చూస్తారనేది అప్పుడే చెప్పలేం. తెలుగు రాష్ట్రాల్లో శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు మొదటి రోజు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – 48 లక్షలు
సీడెడ్ – 22 లక్షలు
ఉత్తరాంధ్ర – 17 లక్షలు
ఈస్ట్ – 13 లక్షలు
వెస్ట్ – 7 లక్షలు
గుంటూరు – 14 లక్షలు
కృష్ణా – 8 లక్షలు
నెల్లూరు – 3 లక్షలు