బంగార్రాజు ఫస్ట్ లుక్.. అదరగొట్టిన నాగ్

ఈరోజు నాగార్జున పుట్టినరోజు. ఈ సందర్భంగా బంగార్రాజు సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ లుక్
చూసిన ఫ్యాన్స్ మాత్రమే కాదు, ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే.. 2016లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో బంగార్రాజు పాత్రలో నాగార్జున ఎలా ఉన్నాడో, ఐదేళ్ల విరామం తర్వాత వస్తున్న
బంగార్రాజు సినిమాలో కూడా నాగార్జున అచ్చం అలానే ఉన్నాడు. ఈ ఐదేళ్లలో నాగ్ ఫిజిక్ లో, లుక్ లో
ఎలాంటి మార్పు రాలేదంటూ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఫస్ట్ లుక్ విషయానికొస్తే.. స్వర్గం మెట్ల పైనుంచి కిందకు దిగుతున్న బంగార్రాజు లుక్ ను ఫస్ట్ లుక్ గా
విడుదల చేశారు. ది డెవిల్ ఈజ్ బ్యాక్ అనే క్యాప్షన్ ను దీనికి తగిలించారు. ఈ సందర్భంగా బంగార్రాజు
టైటిల్ లుక్ ను కూడా రివీల్ చేశారు. సోగ్గాడే చిన్ని నాయనా టైటిల్ డిజైన్ ఎలా ఉందో, దాదాపు అలానే
బంగార్రాజు టైటిల్ కూడా ఉంది.

నాగార్జున, నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతోంది బంగార్రాజు సినిమా. సినిమాలో నాగ్ సరసన రమ్యకృష్ణ,
నాగచైతన్య సరసన కృతిషెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా ఫస్ట్
షెడ్యూల్ ఆల్రెడీ మొదలైంది. ఆ ఫస్ట్ షెడ్యూల్ కు సంబంధించిన స్టిల్ నే ఇలా ఫస్ట్ లుక్ గా విడుదల
చేసింది యూనిట్.