నాగార్జున కొత్త సినిమా టైటిల్ ఇదే

బంగార్రాజు సినిమా అప్ డేట్ తో పాటు నాగార్జున నటిస్తున్న మరో మూవీ అప్ డేట్ కూడా వచ్చేసింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు సంబంధించి టైటిల్ తో పాటు నాగ్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు.

కత్తి పట్టిన నాగార్జున కంప్లీట్ యాక్షన్ లుక్ లో కనిపిస్తున్నాడు. అతడి ముందు విదేశీ గూండాలు తుపాకులు పడేసి రక్షించమని వేడుకుంటున్నారు. టోటల్ సెటప్ అంతా పాత నగరం బ్యాక్ డ్రాప్ లో వర్షం పడుతున్నప్పుడు జరిగిన సన్నివేశంగా చూపించారు. ఈ సినిమాకు ది ఘోస్ట్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

నాగార్జున పుట్టినరోజు సందర్భంగా, ది ఘోస్ట్ సినిమాలో నాగ్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న కాజల్, ఈ
సినిమా టైటిల్ పోస్టర్ తో పాటు, మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ ఒక్క పోస్టర్ తో నాగార్జున-ప్రవీణ్ సత్తారు సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఏషియన్ సునీల్, పుష్కర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మాతలుగా తెరకెక్కుతోంది ఘోస్ట్ సినిమా.