వచ్చే ఏడాది 3 సినిమాలు రిలీజ్ చేస్తాడట

ఈ రెండేళ్లలో నాని నటించిన 2 సినిమాలు వరుసగా ఓటీటీకి వెళ్లిపోయాయి. వి అనే సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో వచ్చేయగా.. ఇప్పుడు టక్ జగదీశ్ కూడా అమెజాన్ లోనే స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతోంది. ఈ క్రమంలో ఎగ్జిబిటర్ల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కొన్నాడు నాని. అందుకే వచ్చే ఏడాది ఏకంగా 3 సినిమాల్ని రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ 3 సినిమాల్ని ఎట్టిపరిస్థితుల్లో థియేటర్లలోనే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాడు.

నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఫస్ట్ కాపీ కూడా రెడీ అవుతుంది. కానీ ఈ ఏడాది ఈ సినిమాను విడుదల చేయడం నానికి ఇష్టం లేదు. వచ్చే ఏడాదే ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు ”అంటే సుందరానికి” అనే మరో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కూడా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అవుతుంది.

ఈ రెండు సినిమాలతో పాటు మరో సినిమాను కూడా 2022లో థియేటర్లలోకి తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నాడు
నాని. ఈ 3 సినిమాలతో పాటు తను నిర్మాతగా మారి తీస్తున్న మీట్ క్యూట్ అనే సినిమాతో పాటు త్వరలోనే తీయబోతున్న హిట్-2ను కూడా థియేటర్లలోనే రిలీజ్ చేస్తానంటున్నాడు. ఇలా తన సినిమాలన్నింటినీ థియేటర్లలో రిలీజ్ చేసి ఎగ్జిబిటర్లను ఖుషీ చేయాలని అనుకుంటున్నాడు నేచురల్ స్టార్.