నాకు సైకో సినిమాలంటే చాలా ఇష్టం

హీరోయిన్లు సాధారణంగా లవ్ స్టోరీస్ ఇష్టపడతారు. మరికొందరికి ఫ్యామిలీ కథలు ఇష్టం. సస్పెన్స్, థ్రిల్లర్
సినిమాలు ఇష్టపడే హీరోయిన్లు కూడా ఉంటారు. కానీ ఇక్కడో హీరోయిన్ మాత్రం తనకు సైకో కథలు
ఇష్టమంటోంది. సైకో థ్రిల్లర్లు, హారర్ సినిమాలంటే తనకు చాలా ఇష్టం అని చెబుతోంది. ఆ హీరోయిన్ పేరు రుహానీ శర్మ.

“ప‌ర్స‌న‌ల్‌గా నాకు సైకో థ్రిల్ల‌ర్ మూవీస్‌ అంటే ఇష్టం. మ‌ల‌యాళంలో డార్క్ క్యారెక్ట‌ర్ చేశాను. త‌ప్పకుండా ఆ సినిమా అంద‌రినీ మెప్పిస్తుంది. మంచి స్క్రిప్ట్ వ‌స్తే భాష‌తో సంబంధం లేకుండా న‌టించ‌డానికి సిద్ధ‌మే.”

ఇలా తన మనసులో మాట బయటపెట్టింది ఈ బ్యూటీ. తెలుగులో అవసరాల శ్రీనివాస్ సరసన నూటొక్క
జిల్లాల అందగాడు అనే సినిమా చేసింది రుహానీ. ఈ సినిమాతో తెలుగులో కచ్చితంగా క్లిక్ అవుతానని
చెబుతోంది. ఈ మూవీతో పాటు నాని నిర్మిస్తున్న మీట్ క్యూట్ అనే సినిమాలో కూడా నటిస్తోంది రుహానీ.