ఎస్ఆర్ కళ్యాణమండపం క్లోజింగ్ కలెక్షన్

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఇప్పుడా సినిమా వసూళ్లు, ఓవరాల్ రెవెన్యూ డీటెయిల్స్ బయటకొచ్చాయి. ఫైనల్ రన్ లో ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాకు వరల్డ్ వైడ్ 8 కోట్ల 31 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇలా తన రెండో సినిమాకే చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు అందుకున్నాడు కిరణ్ అబ్బవరం.

అయితే ఈ సినిమా వసూళ్లు ఇక్కడితో ఆగిపోలేదు. థియేట్రికల్ గా 8 కోట్ల 31 లక్షల రూపాయలు రాబట్టిన ఈ సినిమా..నాన్-థియేట్రికల్ కింద 5 కోట్ల రూపాయలు ఆర్జించింది. మొత్తంగా 13 కోట్ల 31 లక్షల రూపాయలు కలెక్ట్ చేసినట్టయింది. సినిమా బడ్జెట్ తో చూసుకుంటే ఇది దాదాపు రెట్టింపు మొత్తం. అంటే.. ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అన్నమాట.

ఈ సినిమా సక్సెస్ తో యూనిట్ అంతా ఫుల్ జోష్ లోకి వచ్చేసింది. మరీ ముఖ్యంగా కిరణ్ అబ్బవరం
ఆనందానికి అవధుల్లేవ్. ఇప్పటికే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో.. మరో మూడేళ్ల పాటు ఫుల్ బిజీగా ఉండబోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయబోతున్నాడు. అంతా ‘కళ్యాణమండపం’ మహత్యం.

తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఆర్ కళ్యాణమండపం క్లోజింగ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి
నైజాం: 2.94 కోట్లు

సీడెడ్: 1.15 కోట్లు

ఉత్తరాంధ్ర: 0.98 కోట్లు

ఈస్ట్: 0.51 కోట్లు

వెస్ట్: 0.35 కోట్లు

గుంటూరు: 0.69 కోట్లు

కృష్ణా: 0.42 కోట్లు

నెల్లూరు: 0.25 కోట్లు