సాయి ధరమ్ తేజ్ వినూత్న ప్రచారం

దేవకట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘రిపబ్లిక్’ షూటింగ్ పూర్తిచేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. సాయి ధరమ్ తేజ్ కలెక్టర్ గా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 1న థియేటర్స్ లోకి రానుంది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 8 నుండి #ThankYouCollector అంటూ కొందరు కలెక్టర్ల గురించి చెప్తూ వీడియోస్ రిలీజ్ చేయబోతున్నారు.

“సరిహద్దుల్లో నిలబడి, విదేశీ శత్రువుల నుంచి మన దేశాన్ని కాపాడే సైనికుడంటే, మనకు ఎంతో గౌరవం.
వారి వీరిగాథలు ఎన్నో విన్నాం. చూశాం. కానీ, దేశ సరిహద్దుల్లోపల స్వదేశీ శత్రువులు మన వ్యవస్థపై చేసే
అన్యాయాల నుంచి రోజూ కలెక్టర్లు పోరాడుతూనే ఉన్నారు. ఆ పోరాటంలో జయించిన వారూ ఉన్నారు.
ప్రాణాలు కోల్పోయిన వాళ్లూ ఉన్నారు. వాళ్ల గురించి మనలో ఎంతమందికి తెలుసు? అలాంటి ధైర్యవంతులైన కలెక్టర్లను గుర్తించి, ‘థ్యాంక్యూ కలెక్టర్‌’ పేరుతో వారి గాథలను మీ ముందుకు తీసుకొస్తాం” అంటూ ఎనౌన్స్ చేశాడు సాయి తేజ్.

సాయి ధరమ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు , రమ్యకృష్ణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. JB ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.