ఆర్ఆర్ఆర్ సినిమా దాదాపు సంక్రాంతికే?

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలపై నెలకొన్న సందిగ్దత మెల్లమెల్లగా తొలిగిపోతోంది. మేకర్స్ అధికారికంగా
ప్రకటించనప్పటికీ, ఈ సినిమా సంక్రాంతికి రాబోతోందనే విషయంపై ఇండస్ట్రీ దాదాపు ఒక అభిప్రాయానికి
వచ్చేసింది. త్వరలో ఇదే విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేయబోతున్నారు.

అయితే అధికారిక ప్రకటన కంటే ముందు బుజ్జగింపుల పర్వం మొదలైంది. సంక్రాంతి బరిలో ఉన్న హీరోల్ని మెల్లగా బుజ్జగించే కార్యక్రమం మొదలైంది. సంక్రాంతికి మహేష్ సర్కారువారి పాట రిలీజ్ ఉంది. రాజమౌళి నెక్ట్స్ సినిమా మహేష్ తోనే. కాబట్టి ఆ చనువుతో ఆ సినిమాను విడుదల తేదీని మార్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రభాస్ రాధేశ్యామ్ దాదాపు తప్పుకున్నట్టే. ఈ మేరకు ప్రభాస్-రాజమౌళి మధ్య చర్చలు మొదలయ్యాయని అంటున్నారు.

ఇక మిగిలింది ఒకే ఒక్క సినిమా. అదే భీమ్లా నాయక్. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ఇది. ఈ
సినిమాకు సంబంధించి అటు నిర్మాతలనో లేక ఇటు త్రివిక్రమ్ నో కలిస్తే పని జరగదు. స్వయంగా పవన్ ఓకే చెబితేనే ఏ నిర్ణయమైనా అమలౌతుంది. ప్రస్తుతం రాజమౌళి టీమ్ అదే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. పవన్ తన సినిమా వాయిదాకు ఓకే అంటే.. ఆర్ఆర్ఆర్ కు లైన్ క్లియర్ అయినట్టే. లేదంటే పోటీ తప్పకపోవచ్చు.