నా సినిమా ప్రేక్షక విజయం.. సుధీర్ బాబు

సుధీర్ బాబు నటించిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమా తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు
చాలా రివ్యూస్ లో నెగెటివ్ రిమార్క్స్ పడ్డాయి. క్లైమాక్స్ ట్విస్ట్ తప్ప మూవీలో పెద్దగా ఏం లేదంటూ
విమర్శించారు క్రిటిక్స్. దీనిపై సుధీర్ బాబు స్పందించాడు. తన సినిమాను ప్రజా విజయంగా చెప్పుకొచ్చాడు ఈ హీరో.

తనకు రివ్యూస్ కంటే ప్రజల స్పందన ముఖ్యమని ప్రకటించాడు సుధీర్ బాబు. అందుకే శ్రీదేవి సోడా సెంటర్ పోస్టర్ పై ఐఎండీబీ రేటింగ్, గూగుల్ రివ్యూస్, బుక్ మై షో రెస్పాన్స్, పేటీఎం రేటింగ్ మాత్రమే చూపించానని.. ఎవరో ఒకరు రాసిన రివ్యూను తను ప్రొజెక్ట్ చేయలేదని చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం ఈ హీరో, దర్శకుడు కరుణకుమార్ తో కలిసి తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాడు. ఇప్పటికే కోస్తాలో విజయనగరం, విశాఖ, రాజమండ్రి, కాకినాడ లాంటి ప్రాంతాల్ని కవర్ చేశాడు. తాజాగా రాయలసీమలో అడుగుపెట్టాడు. తిరుపతి, కడపలో పర్యటించాడు. శ్రీదేవి సోడా సెంటర్ ప్రదర్శితమౌతున్న థియేటర్లను సందర్శిస్తూ.. ప్రేక్షకుల రెస్పాన్స్ తెలుసుకుంటున్నాడు. ప్రతి సెంటర్ నుంచి సూపర్ హిట్ టాక్ వస్తోందని, అందుకే దీన్ని ఆడియన్స్ హిట్ అంటున్నానని తెలిపాడు సుధీర్ బాబు.