పవన్-హరీష్ శంకర్ మూవీ ప్రీ-లుక్

పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ మూవీకి సంబంధించి ప్రీ-లుక్ ఆడియన్స్ కు కొత్త కాదు. గతంలోనే సినిమాను ఎనౌన్స్ చేసినప్పుడు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. బైక్ పై భగవద్గీత పెట్టిన స్టిల్ అది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా మరో స్టిల్ రిలీజ్ చేశారు. ఈసారి కూడా అదే బైక్. కాకపోతే దానిపై హీరో తుపాకీ పట్టుకొని కూర్చున్న స్టిల్ అది. కాకపోతే ప్రీ-లుక్ కాబట్టి పవన్ కల్యాణ్ ను చూపించలేదు.

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో గతంలో రూపొందిన ‘గబ్బర్ సింగ్’ ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్టయ్యిందో, అందరికి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో రెండో మూవీగా వస్తోంది ఈ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమా.. ఈసారి మరింత వినోదాన్ని అందిస్తుందని అంటున్నారు నిర్మాతలు.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అయాంక బోస్ సినిమాటోగ్రాఫర్. కళా దర్శకుడిగా ఆనంద్ సాయి, ఎడిటర్ గా చోటా కె ప్రసాద్ వర్క్ చేస్తారు.