మరో సినిమా ప్రకటించిన పవన్

హరీష్ శంకర్ తో చేయబోయే సినిమాతో పవన్ కల్యాణ్ ఆపేస్తాడని, ఆ సినిమా పూర్తయిన వెంటనే తిరిగి
రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని జనసైనికులు అనుకున్నారు. కానీ పవన్ తన సినీ ప్రయాణాన్ని ఇప్పట్లో
ఆపేలా కనిపించడం లేదు. ఇప్పటికే 3 సినిమాలు చేస్తున్న ఈ నటుడు, తాజాగా మరో కొత్త సినిమాను
ప్రకటించాడు.

ఈరోజు పవన్ కల్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఓ కొత్త సినిమా ప్రకటన వచ్చింది. రామ్ తళ్లూరి
నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. వక్కంతం వంశీ ఈ సినిమాకు కథ
అందించాడు. ఇప్పటికే పవన్-సురేందర్-వక్కంతం మధ్య కథాచర్చలు పూర్తయ్యాయి. సినిమా సెట్స్ పైకి
రావడమే ఆలస్యం.

సినిమాకు సంబంధించి ప్రీ-లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రాబోతోంది. ఇక సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని ఓ గన్ ఫొటోతో చెప్పకనే చెప్పారు మేకర్స్. తాజా సమాచారం ప్రకారం, స్టయిలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతోంది ఈ సినిమా. హరిహర వీరమల్లు సినిమా పూర్తయిన తర్వాత సినిమా సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది.