రొమాంటిక్ గా సెన్సార్ పూర్తి

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన కుమారుడు ఆకాష్ పూరి తదుపరి చిత్రం `రొమాంటిక్` కోసం కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు. అనిల్ పాదూరి ద‌ర్శ‌కుడు. ఛార్మితో కలిసి పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్‌లపై పూరి జగన్నాధ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.

ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఎలాంటి క‌ట్స్ చెప్ప‌కుండా సెన్సార్ వారు ఈ చిత్రానికి
యు/ఎ స‌ర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో కేతికా శర్మను ఆకాష్ వెన‌క నుండి
కౌగిలించుకోవడం చూడొచ్చు. ఇది సినిమా టైటిల్‌ను జ‌స్టిఫై చేస్తుంది. త్వ‌ర‌లో ఈ మూవీని థియేట‌ర్స్‌లో
విడుద‌ల చేయ‌నున్నారు మేక‌ర్స్‌.

రమ్య‌కృష్ట ఒక కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. ఇంటెన్స్ రొమింటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రానికి సునీల్ కశ్య‌ప్ సంగీతం అందించాడు. న‌రేష్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన పాటలకు విశేష‌ స్పందన వచ్చింది. దాంతో పాటు ఇప్ప‌టివ‌ర‌కు రిలీజైన అన్ని పోస్టర్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సినిమాపై మంచి బ‌జ్‌ని క్రియేట్ చేశాయి.