శృతిహాసన్ కొత్త సినిమా రెడీ

విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘లాభం’. ఏక కాలంలో
రెండు భాషల్లోనూ సినిమా విడుదలవుతుంది. ఇందులో జగపతిబాబు, సాయి ధన్సిక ప్రధాన పాత్రలు
పోషించారు. ఎస్‌.పి.జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై
నిర్మాత ‘వైజాగ్’ సతీష్ తెలుగులో విడుద‌ల చేస్తున్నారు.

అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 9న సినిమాను విడుద‌ల
చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విజ‌య్ సేతుప‌తి విడుద‌ల చేశారు. తెలుగులో ఈ ట్రయిలర్ కు ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది.

వకీల్ సాబ్ తర్వాత శృతిహాసన్ నుంచి తెలుగులో విడుదలవుతున్న సినిమా ఇదే. అటు విజయ్ సేతుపతి
ఈమధ్య కాలంలో 2-3 డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ లో పాపులర్ అయ్యాడు. మరోవైపు ఉప్పెన సినిమా
అతడికి తెలుగులో మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఈ ఎలిమెంట్స్ అన్నీ కలిసి లాభం సినిమా లాభాలు
తెచ్చిపెడుతుందని నిర్మాత నమ్ముతున్నాడు.