హీరోగా బండ్ల గణేష్.. షూటింగ్ మొదలు

ప్రముఖ నటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ కథానాయకుడిగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. వెంకట్ చంద్ర దర్శకుడిగా… యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది. సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.

తమిళ్ లో సూపర్ హిట్టయిన ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’కి‌ రీమేక్ ఇది. తెలుగులో ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. తమిళంలో పార్థిబన్ పోషించిన పాత్రను తెలుగులో బండ్ల గణేష్ చేస్తున్నారు. ఈ హీరో పాత్ర కోసం ఆయన పత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఆయన లుక్, యాక్టింగ్ అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తుందని చెబుతోంది యూనిట్.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫాస్ట్ గా జరుగుతోంది. థర్డ్ వేవ్ ప్రభావం లేకపోతే, నాన్‌స్టాప్‌గా సింగిల్
షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’ను హిందీలో
అభిషేక్ బచ్చన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.‌ చెన్నైలో ఆ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.