గల్లీ రౌడీ రిలీజ్.. మరో డేట్ ఫిక్స్

న‌వ్వుల విందు భోజ‌నాన్ని అందించ‌డానికి సెప్టెంబ‌ర్ 17న ‘గ‌ల్లీరౌడీ’ వ‌చ్చేస్తున్నాడు. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమాకు ఇలా రిలీడ్ డేట్ ఫిక్స్ చేయడం ఇది మూడోసారి. ఈసారి రిలీజ్ గ్యారెంటీ
అంటున్నారు మేకర్స్.

సందీప్ కిషన్, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు కోన వెంకట్ సమర్పకుడు. కోన ఫిల్మ్‌
కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై జి.నాగేశ్వరరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. న‌ట‌కిరిటీ
రాజేంద్ర ప్ర‌సాద్ ఇందులో ఇంపార్టెంట్ రోల్‌ను పోషించగా.. బాబీ సింహ మరో కీలక పాత్రలో కనిపించాడు.

ఇష్ట‌ప‌డ్డ అమ్మాయిని సొంతం చేసుకోవ‌డానికి తానొక పెద్ద రౌడీన‌ని బిల్డ‌ప్ ఇచ్చిన ఓ యువ‌కుడు.. దాని కోసం ఎలాంటి పాట్లు ప‌డ్డాడు. ఆ క్ర‌మంలో ఎలాంటి కామెడీ క్రియేట్ అయ్యింద‌నే అంశంపై ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ‘గ‌ల్లీరౌడీ’ తెరకెక్కింది. సెప్టెంబ‌ర్ 17న ఈ సినిమా జాతకం తేలిపోతుంది.