పవన్ మూవీపై పరోక్షంగా క్లారిటీ

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. దీనికి సంబంధించిన తాజా సమాచారం ఇది.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల షూటింగ్ శరవేగంగా జరుగుతున్నాయి. ‘భీమ్లా నాయక్’ చిత్రం త్వరలో పూర్తి కానుంది. ‘హరి హర వీరమల్లు’ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభమౌతుంది. ఆ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే చిత్రం షూటింగ్ మొదలవుతుంది. ఇలా పవన్ తో చేయబోయే సినిమాపై క్లారిటీ ఇచ్చింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.

వీళ్లు ఇచ్చిన స్టేట్ మెంట్ లో కొత్తదనం లేదు. అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ వీళ్లు ఇలా మీడియా ప్రకటన ఇవ్వడం వెనక ఓ రీజన్ ఉంది. తాజాగా రామ్ తళ్లూరి నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు పవన్. హరీశ్ శంకర్ సినిమా కంటే ముందే ఇది సెట్స్ పైకి వస్తుందంటూ ఓ పుకారు చెలరేగింది. దీనిపై పరోక్షంగా క్లారిటీ ఇవ్వడం కోసం మైత్రీ నిర్మాతలు ఇలా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.