ఈసారి ఈ జంట హ్యాట్రిక్ కొడుతుందట!

అల్లు అర్జున్, పూజా హెగ్డే కలిసి గతంలో దువ్వాడ జగన్నాధమ్ సినిమా చేశారు. ఆ సినిమా తర్వాతే ఆమె దశ తిరిగింది. ఇంకా చెప్పాలంటే పూజా హెగ్డేకు బన్నీనే బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ బన్నీనే ఆమెకు బ్రేక్ ఇచ్చాడు. అల వైకుంఠపురములో సినిమాతో పూజా హెగ్డే క్రేజ్ రెట్టింపు అయింది. అలా బుట్టబొమ్మకు దశలవారీగా బ్రేక్ ఇస్తున్న బన్నీ, ఇప్పుడు ఆమెకు మరోసారి ఛాన్స్ ఇవ్వబోతున్నాడు.

అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీలో పూజా హెగ్డే మరోసారి మెరవబోతోంది. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమా చేయబోతున్నాడు బన్నీ. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా సెట్స్ పైకి రావడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. కానీ నిర్మాత దిల్ రాజు మాత్రం ముందుగానే పూజాహెగ్డే కాల్షీట్లను రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు. ఈ మేరకు ఆమెకు అడ్వాన్స్ కూడా అందించినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం పుష్ప సినిమా పార్ట్-1 ను కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు బన్నీ. ఆ సినిమా పూర్తయిన తర్వాత ఐకాన్ స్టార్ట్ చేస్తాడా లేక పుష్ప పార్ట్-2ను స్టార్ట్ చేస్తాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత పూజా హెగ్డే కాల్షీట్లను లాక్ చేస్తారు.