జయలలితకు, కంగనాకు పోలిక ఏంటి?

జయలలిత బయోపిక్ తలైవిలో నటించింది కంగన. మరి నిజజీవితంలో జయలలిత, కంగనా రనౌత్
వ్యక్తిత్వాల మధ్య పోలిక ఏదైనా ఉందా? ఆ పోలిక ఏంటో స్వయంగా కంగనా బయటపెట్టింది. జయలలిత
వ్యక్తిత్వానికి, తన వ్యక్తిత్వానికి మధ్య బలమైన సారూప్యత ఉందంటోంది.

“జయలలిత గారిని జూనియర్ ఆర్టిస్ట్ కూతురు అని అన్నారు.. ఆమెకు సినిమాల్లోకి రావడం ఇష్టం
లేకపోయినా వచ్చారు.. టాప్ ప్లేస్‌కు చేరుకున్నారు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నన్ను కూడా వెక్కిరించారు. పహాడి అమ్మాయి.. ఆమె ఏం చేయగలదు అని అన్నారు. కానీ నేను కూడా ఎన్నో విజయాలు సాధించాయి. కానీ నా ప్రయాణం ఇక్కడే ఆగింది. జయమ్మ గారు రాజకీయాల్లోనూ విజయం సాధించారు.”

ఇలా నిజజీవితంలో తనకు, జయలలితకు మధ్య పోలిక పెట్టింది కంగన. రాబోయే రోజుల్లో కూడా సౌత్ లో
నటిస్తానన్న కంగన.. అవకాశం దొరికితే మరోసారి ప్రభాస్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటానని చెబుతోంది.

“మంచి అవకాశాల కోసం మనం ఎదురుచూడాలి. తమిళంలో ధామ్ ధూం సినిమా ఎప్పుడో చేశాను.. తరువాత విజయ్ సార్ ఈ ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడు కూడా పూరి సర్‌ని అడుగుతుంటాను.. ప్రభాస్ పక్కన మరో చాన్స్ ఇవ్వండి.. నేను ఎందుకు చేయను అని అంటుంటాను. ఆయన పిలిస్తే మళ్లీ సినిమా చేస్తాను. పూరి గారు పిలవాలని ఆశిస్తున్నాను.”

ఈ సందర్భంగా తన పొలిటికల్ ఎంట్రీపై కూడా స్పందించింది కంగన. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని, తెలుగు, తమిళంతో పాటు మరిన్ని భాషల్లో మరిన్ని మంచి సినిమాలు చేయాలని ఉందని
స్పష్టంచేసింది.