దసరా కానుకగా విశాల్ సినిమా

విశాల్, ఆర్య కలిసి నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఎనిమి’. పది సంవత్సరాల క్రితం దర్శకుడు
బాలా తెరకెక్కించిన ‘వాడు–వీడు’ సినిమా తర్వాత వీరిద్ద‌రు క‌లిసి న‌టిస్తోన్న చిత్ర‌మిది. ఇది హీరో విశాల్‌ కు 30వ చిత్రం కాగా, ఆర్యకు 32వ సినిమా. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ఫిక్స్ చేశారు. దసరా కానుకగా సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

‘గద్దలకొండ గణేష్‌’ ఫేమ్‌ మృణాళిని రవి, మ‌మ‌తా మోహ‌న్‌దాస్‌ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో
విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో మినీ
స్టూడియోస్‌ పతాకంపై వినోద్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇప్ప‌టికే విడుద‌లైన యాక్ష‌న్ ప్యాక్డ్ టీజ‌ర్‌కి, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. త్వరలోనే థియేట్రికల్
ట్రయిలర్ విడుదల చేయబోతున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.