ఓటీటీలతో నాగార్జున మంతనాలు

ప్రస్తుతం బంగార్రాజు, ది ఘోస్ట్ సినిమాలు చేస్తున్నాడు నాగార్జున. రెండూ క్రేజీ ప్రాజెక్టులే. అయినప్పటికీ
నాగార్జున ఆలోచనలు మాత్రం మరో విధంగా సాగుతున్నాయి. కుదిరితే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వాలనేది నాగ్
ప్లాన్. అందుకే ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓటీటీ సంస్థలతో చర్చలు సాగిస్తున్నాడు నాగ్.

నిజానికి నాగ్ ఓటీటీ ఎంట్రీ ఈపాటికే జరిగిపోవాలి. నెట్ ఫ్లిక్స్ నుంచి వచ్చిన ఓ ఆఫర్ ను ఆయన
అంగీకరించారు. అయితే కథాచర్చల్లో నాగార్జున సంతృప్తి వ్యక్తం చేయలేదు. అలా అని ఆ ప్రాజెక్టును
తిరస్కరించలేదు. ఇంకాస్త వర్క్ చేయమని చెప్పి పంపించేశారు. ఈ గ్యాప్ లో జీ5, అమెజాన్ ప్రైమ్ సంస్థల ప్రతినిథుల్ని కూడా నాగ్ సంప్రదించారు.

మంచి కంటెంట్ తో వస్తే ఓటీటీలో వెబ్ సిరీస్ చేయడానికి తను సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు నాగ్. ఈ
మేరకు జీ5, అమెజాన్ ప్రైమ్ ప్రతినిధులు.. నాగ్ కోసం మంచి కంటెంట్ వెదికే పనిలో పడ్డారు.

ప్రస్తుతానికైతే నాగార్జున ఓటీటీ డెబ్యూ కాస్త అలస్యమైంది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్, జీ5లో ఎవరు ముందుగా
మంచి స్టోరీ వినిపిస్తారో నాగ్ వాళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడు.