ఆర్ఆర్ఆర్ అఫీషియల్ వాయిదా

ఆర్ఆర్ఆర్ సినిమా మరోసారి అఫీషియల్ గా వాయిదా పడింది. చెప్పిన తేదీ అక్టోబర్ 13కు ఈ సినిమా రాదని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే మేకర్స్ మాత్రం ఆ విషయాన్ని చెప్పలేదు. ఎట్టకేలకు ఆ టైమ్ రానే వచ్చింది. సినిమాను వాయిదా వేస్తున్నట్టు ఆర్ఆర్ఆర్ యూనిట్ తెలిపింది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపిన యూనిట్.. అక్టోబర్ 21 నాటికి ఫస్ట్ కాపీ రెడీ అవుతుందని ప్రకటించింది. అంటే దానర్థం, అక్టోబర్ 13కి సినిమా థియేటర్లలోకి రాదనే. ఇక కొత్త విడుదల తేదీపై స్పందించిన యూనిట్, ప్రపంచవ్యాప్తంగా సినిమా మార్కెట్లు తెరుచుకున్న వెంటనే తమ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పుకొచ్చింది.

చూస్తుంటే.. ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్లలోకి రాదనే విషయం తెలుస్తూనే ఉంది. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తారనే ప్రచారం మరోవైపు జోరుగా సాగుతోంది. సంక్రాంతికి ఈ సినిమా వస్తుందా రాదా అనే విషయాన్ని యూనిట్ ఇంకా సస్పెన్స్ లోనే పెట్టింది.