సాయి ధరమ్ తేజ్ సేఫ్

హీరో సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు గురైన సంగతి తెలిసిందే. ఆయన ప్రాణాపాయం నుంచి
బయటపడ్డాడు. ప్రస్తుతం అపోలో హాస్పిటల్ లో సాయితేజ్ కు ట్రీట్ మెంట్ నడుస్తోంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు డాక్టర్లు ఇచ్చిన నివేదిక ప్రకారం.. సాయితేజ్ కోలుకుంటున్నాడు.

“సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య స్థితి నిలకడగా ఉంది. ఎలాంటి ఇంటర్నల్ బ్లీడింగ్ లేదు. ఆయన శరీరం
చికిత్సకు సహకరిస్తోంది. డాక్టర్ అలోక్ రంజన్, అతడి యూనిట్ సాయితేజ్ కు ట్రీట్ మెంట్ ఇస్తోంది.”

ఇలా సాయితేజ్ ఆరోగ్య పరిస్థితిపై స్టేట్ మెంట్ ఇచ్చింది అపోలో. అయితే సాయితేజ్ కు కాలర్ బోన్
విరిగింది. దానికి సర్జరీ చేయాల్సి ఉంది. అయితే ఆపరేషన్ ఇప్పుడే చేయాలా వద్దా అనే అంశంపై మరో 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటారు.

మరోవైపు సాయితేజ్ స్పృహలోకి వచ్చినట్టు తెలుస్తోంది. వీడియో కాల్ ద్వారా తన కుటుంబ సభ్యుల్ని
సాయితేజ్ పలకరించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. మొత్తమ్మీద ఓ పెద్ద ప్రమాదం నుంచి సాయితేజ్
బయటపడ్డాడు.