హిట్ సినిమాకు రీమేక్ మొదలు

తెలుగులో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన మిస్ట‌రీ యాక్ష‌న్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ‘హిట్ – ది ఫ‌స్ట్ కేస్‌’ సినిమా
బాలీవుడ్ రీమేక్ స్టార్ట్ అయింది. ఈరోజు లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేశారు. తెలుగులో ‘హిట్‌’ సినిమాను డైరెక్ట్ చేసిన శైలేష్ కొల‌ను హిందీలోనూ డైరెక్ట్ చేస్తున్నాడు. హిందీలో దిల్ రాజు, టి-సిరీస్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తారు.

రాజ్‌కుమార్ రావ్‌, సాన్యా మ‌ల్హోత్రా హీరోహీరోయిన్లుగా న‌టించబోతున్నారు. ఈ కార్య‌క్రమంలో హీరో రాజ్
కుమార్ రావ్‌, నిర్మాతలు దిల్‌రాజు, భూష‌ణ్ కుమార్‌, కుల్దీప్ రాథోర్‌తో పాటు ద‌ర్శ‌కుడు డా.శైలేష్ కొల‌ను
పాల్గొన్నారు.

న‌గరంలో క‌నిపించ‌కుండా పోయిన అమ్మాయిల‌ను వెతికే పోలీస్ టీమ్ హోమిసైడ్ ఇంట‌ర్వెన్‌ష‌న్ టీమ్‌లో
ఆఫీస‌ర్.. ఈ కేసును ఎలా సాల్వ్ చేశాడ‌నేదే ఈ సినిమా క‌థాంశం. మిస్ట‌రీ, స‌స్పెన్స్ అంశాలతో ఆక‌ట్టుకునే సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్ ఇది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ స‌భ్యులు తెలియ‌జేశారు. టి-సిరీస్ ప్రాజెక్టు కాబట్టి ఎప్పట్లానే ఈ మూవీకి ఇద్దరు ముగ్గురు మ్యూజిక్ డైరక్టర్లు వర్క్ చేసే ఛాన్స్ ఉంది.