సాయిధరమ్ తేజ్ సర్జరీ పూర్తి

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు హీరో సాయి ధరమ్
తేజ్. అతడికి కాలర్ బోన్ విరిగినట్టు వైద్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడా కాలర్ బోన్ కు
సంబంధించి సర్జరీని పూర్తిచేశారు.

ఈరోజు సాయి ధరమ్ తేజ్ భుజానికి శస్త్రచికిత్స నిర్వహించినట్టు వైద్యులు ప్రకటించారు. సాయి ధరమ్ తేజ్ ట్రీట్ మెంట్ కు బాగా సహకరిస్తున్నాడని, త్వరలోనే అతడు కోలుకుంటాడని చెబుతున్నారు. ఈ మేరకు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు.

సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై ఆరా తీసేందుకు ఈరోజు మరోసారి హాస్పిటల్ కు వచ్చాడు హీరో రామ్ చరణ్. చరణ్ తో పాటు ఉపాసన కూడా వచ్చింది. మరోవైపు యాక్సిడెంట్ పై మీడియాలో వస్తున్న కథనాల్ని టాలీవుడ్ ప్రముఖులు ఖండిస్తున్నారు. మీడియా కథనాలతో పాటు సీనియర్ నటుడు నరేష్ చేసిన వ్యాఖ్యల్ని బండ్లగణేశ్, శ్రీకాంత్ లాంటి నటులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.