గల్లీ రౌడీ ట్రయిలర్ రివ్యూ

సందీప్ కిషన్ హీరోగా నటించిన సినిమా గల్లీ రౌడీ. ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది. చిరంజీవి చేతుల మీదుగా రిలీజైన ఈ ట్రయిలర్ ఎలా ఉందో చూద్దాం..

‘నీకు తెలిసిన రౌడీ ఎవ‌రైనా ఉన్నారా?’ అని వైవా హ‌ర్ష‌ను హీరోయిన్‌ అడిగితే నా ఫ్రెండే పెద్ద రౌడీ అనే
డైలాగ్‌తో ట్రైల‌ర్ మొద‌ల‌వుతుంది. సందీప్ కిష‌న్ ప‌రిచయం ఓ రేంజ్‌లో ఎంట‌ర్‌టైనింగ్‌గా అనిపిస్తుంది. అదే హీరోయిన్ ‘ఇత‌ను నిజంగానే రౌడీనా?’ అని ప్ర‌శ్నిస్తే.. ‘రోజూ పులిగోరు అవీ ఇవీ పెడ‌తావు క‌దా అవెక్క‌డ’ అంటూ వైవాహ‌ర్ష ప్ర‌శ్నించ‌డం దానికి బ‌దులుగా సందీప్ ‘మొదటిసారి కాఫీ షాప్‌కు వ‌స్తున్నా క‌దా, కాస్త క్లాస్‌గా ఉందామని’ అని బ‌దులిస్తాడు. దానికి రివ‌ర్స్‌గా వైవా హ‌ర్ష ‘ఏసుకోరా రౌడీ అంటే ఎవ‌రూ న‌మ్మ‌ట్లేదు’ అని చెప్పే డైలాగ్‌తోనే హీరో క్యారెక్ట‌ర్ ఏంటి? త‌ను ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఫేస్ చేస్తున్నాడ‌నే విష‌యం రివీల్ అవుతుంది.

ఇలా ట్రయిలర్ మొత్తం కామెడీ ఎలిమెంట్స్ తో నిండిపోయింది. బాబీ సింహ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో కాస్త
సీరియస్ గా కనిపించినప్పటికీ.. రాజేంద్ర ప్ర‌సాద్‌ స‌హా ప్ర‌తి పాత్ర ఎంట‌ర్‌టైనింగ్‌లోనే సాగింది. ఇలా ప్రతి మలుపులో కామెడీని మిక్స్ చేస్తూ తెరకెక్కింది గల్లీ రౌడీ మూవీ. సెప్టెంబర్ 17న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది.