ఈ సారైనా రీసౌండ్ వస్తుందా?

కొంత విరామం త‌ర్వాత హీరో సాయి రామ్ శంకర్ ఒక ప‌ర్‌ఫెక్ట్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాతో మ‌న ముందుకు
వ‌స్తున్నారు. ఎస్ఎస్ మురళీ కృష్ణ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ మూవీలో రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అరవింద్ కృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈరోజు సాయి రామ్ శంకర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా, సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి `రీసౌండ్` అని ప‌వ‌ర్‌ఫుల్‌, మాస్-అప్పీలింగ్ ఉన్న టైటిల్ ఖ‌రారు చేశారు. డైరెక్టర్స్ గోపీచంద్ మలినేని, బాబీ `రీసౌండ్‌` ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు.

ఇక ఫస్ట్ లుక్ విష‌యానికి వ‌స్తే సాయి రామ్ శంక‌ర్ బీడీ తాగుతూ పోలీస్ స్టేష‌న్‌లో కుర్చీలో కూర్చుని ఉన్నారు. అంత‌కు ముందు పోలీసుల‌తో ఘ‌ర్ష‌న జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. టైటిల్ కు త‌గ్గ‌ట్టుగా ఈ ఫ‌స్ట్ లుక్‌ పోస్ట‌ర్ కూడా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో సాయి రామ్ శంకర్ యాక్షన్-ప్యాక్డ్ రోల్ ఎలా ఉంబోతుందో ఈ పోస్ట‌ర్‌ సూచిస్తుంది. కొన్నాళ్లుగా సరైన హిట్ లేని సాయిరామ్ శంకర్, ఈ సినిమాతోనైనా రీసౌండ్ చేస్తాడేమో చూడాలి.