నా పెళ్లిపై చర్చ అనవసరం

హీరోయిన్ శృతిహాసన్ అసహనం వ్యక్తం చేసింది. ప్రతి ఇంటరాక్షన్ లో మీడియా జనాలు తన పెళ్లి గురించి అడుగుంటే ఆమె సహనం కోల్పోయింది. ఇక ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో పెళ్లిపై స్పష్టమైన ప్రకటన చేసింది. శృతిహాసన్ చెప్పేది ఏంటంటే.. ఆమె జీవితంలో పెళ్లి చేసుకోదట.

అవును.. తనకు ఎప్పటికీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని శృతిహాసన్ కుండబద్దలు కొట్టింది. పనిలో పనిగా మీడియాకు కూడా చురకలు అంటించింది. ఈ ఏడాది మాట్లాడుకోవడానికి కరోనాతో పాటు చాలా
అంశాలున్నాయని, వాటి ముందు తన పెళ్లి మేటర్ చాలా చిన్నదని అంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇకనైనా
మీడియా తన పెళ్లి గురించి అడగడం మానేయాలని పరోక్షంగా చురకలంటించింది.

శృతిహాసన్ వయసు 35 ఏళ్లు. ఆమె ఇప్పటికే లండన్ కు చెందిన ఓ వ్యక్తితో డేటింగ్ చేసి బ్రేకప్ కూడా
చెప్పేసింది. ప్రస్తుతం ముంబయిలోనే మరో వ్యక్తితో కొత్త రిలేషన్ షిప్ షురూ చేసింది. ఓవైపు ఇంత
ప్రేమాయణం సాగుతున్నప్పటికీ ఆమె పెళ్లి చేసుకోనని చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.