పీవీ సింధు బయోపిక్ రాబోతుందా?

రియల్ లైఫ్ లో సక్సెస్ అయన వారి జీవితాలను తెర మీద అందంగా చూపిస్తే.. ప్రేక్షకులకు లభించే థ్రిల్లే వేరు. అందుకే మన దగ్గర బయోపిక్కులు సూపర్ సక్సెస్ ఫార్ములాగా వర్కవుట్ అవుతుంటాయి. అయితే ఒలింపిక్స్ లో వరుసగా రెండు పతకాలు సాధించిన పీవీ సింధు బయో పిక్ కూడా రాబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో అందులో నటించబోయేదెవరంటే..

ప్రపంచ బ్యాడ్మింటన్ లో ఓ వెలుగు వెలిగిన పీవీ సింధుపై బయో పిక్ రాబోతుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే.. సింధు పాత్రలో నటించనుంది. ఇప్పటికే దీపికా పదుకొనే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పాటు ఫిమేల్ సెంట్రిక్ కథల్లో కూడా నటిస్తూ.. మంచి నటిగా గుర్తింపు పొందింది. తాజాగా పి.వి సింధు సక్సెస్ స్టోరీతో మరో ప్రయోగానికి రెడీ అయింది.

ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే.. దీపికా పదుకొనే తండ్రి ప్రకాష్ పదుకొనే ఫేమస్ బ్యాడ్మింటన్ ప్లేయర్. దీపికాకు కూడా బ్యాడ్మింటన్ లో కొంత అనుభవం ఉంది. ఇకపోతే సింధు బయోపిక్ ను కి సంబంధించి దీపికా తన ఓన్ బ్యానర్ కా ప్రొడక్షన్ లోనే సినిమాని తెరకెక్కించనున్నట్లు టాక్. ఏదేమైనా మరికొద్ది రోజుల్లో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన డీటెయిల్స్ బయటకొచ్చే అవకాశం ఉంది.