బిగ్ బాస్ మరోసారి అదరగొట్టాడు

సీజన్-1 నుంచి ఇప్పటి సీజన్-5 వరకు బిగ్ బాస్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. అత్యథిక టీఆర్పీలు
సాధిస్తూనే ఉంది. స్టార్ మా ఛానెల్ ను మొదటి స్థానంలో నిలబెడుతూనే ఉంది. తాజాగా బిగ్ బాస్ సీజన్-5 రేటింగ్స్ వచ్చాయి. ఈసారి కూడా రికార్డులు బద్దలయ్యాయి. నాగార్జున హోస్ట్ గా నటించిన బిగ్ బాస్ సీజన్-5 ప్రారంభ ఎపిసోడ్ కు గరిష్టంగా 18 (ఎస్ డీ, హెచ్ డీ కలిపి) టీఆర్పీ రావడం విశేషం.

తాజా టీఆర్పీతో తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ రియాలిటీ షోకు ఉన్న ఆదరణ ఏంటో అందరికీ అర్థమైంది.
కేవలం ప్రారంభ ఎపిసోడ్స్ కు మాత్రమే కాకుండా.. వర్కింగ్ డేస్ లో నాగార్జున లేకుండా ప్రసారమైన మిగతా ఎపిసోడ్స్ కు కూడా మంచి రేటింగ్స్ వచ్చాయి. బిగ్ బాస్ దెబ్బతో స్టార్ మా ఛానెల్ మరోసారి ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. ఓవరాల్ జీఆర్పీస్ లో ఈ ఛానెల్ కు దరిదాపుల్లో కూడా మరో తెలుగు ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ లేకపోవడం గమనార్హం.

ఇక సీజన్ల వారిగా బిగ్ బాస్ తొలి వారం యావరేజ్ రేటింగ్స్ ఓసారి చూద్దాం. బిగ్ బాస్ సీజన్-1 తొలివారం
సగటు రేటింగ్ 10.69 వచ్చింది. రెండో సీజన్ తొలివారం సగటు రేటింగ్ 3.50 కాగా.. సీజన్-3 తొలివారం సగటు రేటింగ్ 4.66గా వచ్చింది. ఇక నాలుగో సీజన్ లో తొలివారం 7.22 సగటు రేటింగ్ రాగా.. తాజాగా సీజన్-5 మొదటి వారం యావరేజ్ టీఆర్పీ 6.67 వచ్చింది. దీంతో సీజన్-5 క్లిక్ అయిందంటున్నారు చాలామంది.