చిరుతో గోపీచంద్ దర్శకుడు

కథ ఏమాత్రం బాగున్నా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు చిరంజీవి. సినిమాలే లోకంగా బతికేస్తున్న
మెగాస్టార్, యంగ్ డైరక్టర్లను ఎంకరేజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే
దర్శకుడు బాబికి అవకాశం ఇచ్చిన మెగాస్టార్, ఇప్పుడు సంపత్ నందితో కూడా సినిమా చేసే ఆలోచనలో
ఉన్నారు.

అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే సంపత్ నంది దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేస్తారు. ఇప్పటికే
చిరంజీవిని కలిసి ఓ లైన్ వినిపించాడు సంపత్ నంది. స్టోరీలైన్ నచ్చిన చిరంజీవి, పూర్తిస్థాయిలో దాన్ని
డెవలప్ చేయమని చెప్పడం, సంపత్ నంది ఎగిరి గంతేయడం జరిగిపోయాయి.

మరోవైపు మారుతి దర్శకత్వంలో కూడా చిరంజీవి ఓ సినిమా చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై మారుతి దర్శకత్వంలో ఓ కామెడీ ఎంటర్ టైనర్ చేస్తారని, ప్రస్తుతం మారుతి అదే పని మీద బిజీగా ఉన్నాడని అంటున్నారు. మొత్తమ్మీద చిరంజీవి సెకెండ్ ఇన్నింగ్స్ లో దూకుడు పెంచినట్టు కనిపిస్తోంది.