త్వరగా కోలుకుంటున్న సాయితేజ్

రోడ్డు ప్రమాదానికి గురై హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నాడు. ఈరోజు
ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగైంది. పూర్తిస్థాయిలో సాయితేజ్ కు పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ఈరోజు అతడికి వెంటిలేటర్ ను తొలిగించారు. కృత్రిమ శ్వాస నుంచి బయటపడిన సాయితేజ్, ఈరోజు నుంచి సొంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారు.

రోడ్డు ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ కు తీవ్ర గాయమైంది. కాలర్ బోన్ విరిగింది. 3రోజుల కిందట దీనికి
సంబంధించి శస్త్రచికిత్స పూర్తిచేశారు. ఆ సర్జరీ నుంచి కోలుకున్న వెంటనే సాయితేజ్ హాస్పిటల్ నుంచి
డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది

వినాయక చవితి రోజున బైక్ పై వేగంగా ప్రయాణిస్తూ, కేబుల్ బ్రిడ్జిపై జారిపడ్డాడు సాయిధరమ్ తేజ్. వెంటనే అతడ్ని అంబులెన్స్ లో దగ్గర్లో ఉన్న మెడికవర్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రథమ చికిత్స పూర్తయిన తర్వాత అపోలో హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు.