ఇదే మా కథ టీజర్ రివ్యూ

సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించిన రోడ్ జర్నీ చిత్రం ‘ఇదే మా కథ’. గురు పవన్ దర్శకత్వం వహించారు. శ్రీ‌మ‌తి మ‌నోర‌మ స‌మ‌ర్ప‌ణ‌లో గుర‌ప్ప ప‌ర‌మేశ్వ‌ర ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై మహేష్ గొల్లా ఈ చిత్రాన్ని నిర్మించారు.

టాలీవుడ్ లోనే మొదటి రోడ్ జర్నీ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కాన్సెప్ట్ టీజ‌ర్‌ను విక్ట‌రీ
వెంక‌టేష్ రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఇదే మా క‌థ టీజ‌ర్ చాలా బాగుంద‌ని ఇలాంటి కొత్త త‌ర‌హా చిత్రాలు మ‌రిన్ని రావాల‌ని కోరుకుంటూ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

ప్రపంచంలోని చాలా మంది వ్యక్తులకు తమ కలల గమ్యస్థానానికి వెళ్లాలనే కోరిక ఉంటుంది. కానీ, వారిలో
చాలా మంది జీవించడంలో విఫలమవుతుంటారు. బైక్‌లంటే విపరీతమైన ఇష్టం ఉండే, వివిధ వయసులకు చెందిన నలుగురి అపరిచితుల కథ ఇది. వీరంతా వారి జీవిత ప్రయాణాన్ని ప్రారంభించి, ఏం తెలుసుకున్నారనేది ఈ సినిమా కథ. సునీల్ కశ్యప్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇప్పటికే
ఇందులోని ఓ పాట పెద్ద హిట్టయింది.