నాగచైతన్యకు అదొక్కటే కష్టం

గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు నాగచైతన్య. అయితే ఏ సినిమాకూ పడని కష్టాన్ని లవ్ స్టోరీ
సినిమాకు ఎదుర్కొన్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమాకు సంబంధించి తను పడిన కష్టాన్ని బయటపెట్టాడు నాగచైతన్య.

“లవ్ స్టోరీ కథ బాగా నచ్చింది. శేఖర్ అన్నీ బాగా నెరేట్ చేశాడు. కానీ ఇందులో నేను జుంబా డాన్స్ ట్రయినర్ గా నటించాల్సి వచ్చింది. అదొక్కటి మార్చడం కుదరదా అని అడిగాను. కష్టం అన్నాడు. ఇక తప్పలేదు. నా కెరీర్ లో ఏదైనా లోపం ఉందంటే అది డాన్స్ మాత్రమే. నేను పెద్దగా డాన్స్ చేయలేను. అలాంటి నాతో డాన్స్ చేయించాడు శేఖర్. దీని కోసం గంటల తరబడి డాన్స్ రిహార్సల్స్ చేయాల్సి వచ్చింది. పైగా సాయిపల్లవితో డాన్స్ అంటే నాకు చెమట్లు పట్టేవి.”

ఇలా లవ్ స్టోరీ మేకింగ్ లో తను పడిన కష్టాన్ని బయటపెట్టాడు నాగచైతన్య. ఈ సినిమాలో దిగువ
మధ్యతరగతి కుర్రాడిలా, సాదాసీదా లుక్ లో కనిపించాల్సి వచ్చిందని.. అందుకే తన చర్మం రంగును
తగ్గించడం కోసం దర్శకుడు శేఖర్ కమ్ముల తనను ఎండలో నిలబెట్టేవాడని చెప్పుకొచ్చాడు నాగచైతన్య. ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది లవ్ స్టోరీ.