సాయితేజ్ కోసం చిరంజీవి, పవన్

రోడ్డు యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడి అపోలోలో చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్.. రిపబ్లిక్ సినిమా ప్రచారానికి దూరమయ్యాడు. దీంతో సాయితేజ్ కోసం మెగాబ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్ రంగంలోకి దిగుతున్నారు. భారీ ప్రచారం చేయబోతున్నారు.

ముందుగా చిరంజీవి విషయానికొద్దాం.. తన మేనల్లుడు సాయితేజ్ కోసం చిరంజీవి ప్రచార బాధ్యతల్ని భుజాన వేసుకున్నారు. స్వయంగా రిపబ్లిక్ ట్రయిలర్ ను లాంఛ్ చేయబోతున్నారు. రేపు ఉదయం 10 గంటలకు రిపబ్లిక్ ట్రయిలర్ విడుదలకాబోతోంది.

ఇక పవన్ కల్యాణ్ కూడా రిపబ్లిక్ ప్రచారంలో పాల్గొంటారు. 25న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టుకున్నారు. ఆ వేడుకకు పవన్ ప్రత్యేక అతిథిగా హాజరుకాబోతున్నారు. ఇలా సాయిధరమ్ తేజ్ కోసం అటు చిరంజీవి, ఇటు పవన్ కల్యాణ్ రంగంలోకి దిగి, సినిమాకు భారీగా ప్రచారం కల్పిస్తున్నారు.

అక్టోబర్ 1న రిపబ్లిక్ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. దేవకట్టా డైరక్ట్ చేసిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్
హీరోయిన్ గా నటించింది.