సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన కమ్ముల

శేఖర్ కమ్ముల తీసిన సినిమాల్లో డిఫరెంట్ మూవీ ఏదైనా ఉందంటే అది కచ్చితంగా లీడర్ సినిమా మాత్రమే. రాజకీయాలు, అవినీతిపై కమ్ముల సంధించిన ఈ సినిమా అస్త్రం.. తర్వాత రోజుల్లో కల్ట్ మూవీగా నిలిచిపోయింది. ప్రేక్షకులకు మాత్రమే కాదు, కమ్ములకు కూడా చాలా ఇష్టమైన మూవీ ఇది. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ తీస్తానని ప్రకటించాడు ఈ దర్శకుడు.

“లీడర్ సీక్వెల్ తప్పకుండా చేస్తాను. రానాతోనే సీక్వెల్ ఉంటుంది. కథగా సీక్వెల్ కాదు, క్యారెక్టర్స్ తోనే సీక్వెల్ చేస్తాను. లీడర్ లో ఓపెన్ ఎండ్ ఉంటుంది. లీడర్-2 కూడా అలానే ఓపెన్ గా స్టార్ట్ అవుతుంది. ఈసారి సీక్వెల్ లో మరిన్ని సోషల్ ఇష్యూస్ టచ్ చేస్తాను.”

ఇలా లీడర్ సినిమా సీక్వెల్ పై సూటిగా స్పందించాడు శేఖర్ కమ్ముల. కాకపోతే అది ఎప్పుడూ కార్యరూపం
దాలుస్తుందనే విషయాన్ని మాత్రం కమ్ముల చెప్పలేకపోయాడు. ప్రస్తుతం లవ్ స్టోరీ సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ దర్శకుడు.. త్వరలోనే ధనుష్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు.