అనుభవించు రాజా టీజర్ రివ్యూ

రాజ్ తరుణ్, డైరెక్టర్ శ్రీను గవిరెడ్డి కాంబినేషన్‌లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం `అనుభవించు రాజా` . ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు రాజ్ తరుణ్. అతడు ఎందుకు అంత నమ్మకం పెట్టుకున్నాడో ఈరోజు రిలీజైన టీజర్ చూస్తే అర్థమౌతుంది.

భీమవరంలో కోడి పందెం సెటప్ ను చూపిస్తూ పందెం రాయుళ్లందరికీ స్వాగతం పలకడంతో ఈ టీజర్
ప్రారంభమైంది. ‘అనుభవించు రాజా..’ అంటూ సూపర్ హిట్ ఓల్డ్ సాంగ్ ప్లే అవుతుండగా.. విలాసాలకు
అలవాటు పడిన జూదగాడిగా రాజ్ తరుణ్ తన స్టైల్లో ఎంట్రీ ఇస్తాడు. పందెం కాయడం, బెట్టింగ్ వేయడం, గ్యాంబ్లింగ్ చేయడం, పేకాట ఆడటం, రికార్డు డ్యాన్సులు చేయడం వంటి మాస్ ఎలిమెంట్స్‌ కనిపిస్తున్నాయి.

ఎనర్జిటిక్ గా ఉండే రాజ్ తరుణ్ బంగారం పాత్రకు కరెక్ట్ గా సూట్ అయ్యాడు. గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్ కు మరో ప్రధాన ఆకర్షణ. సినిమాటోగ్రాఫర్ నగేష్ బానెల్ కెమెరా పనితనం కారణంగా గ్రామీణ వాతావరణం కలర్ ఫుల్ గా.. ప్రొడక్షన్ డిజైన్ గ్రాండ్ గా కనిపిస్తుంది. రాజ్ తరుణ్ సరసన కాషిష్ ఖాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను త్వరలోనే థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు.