గోవాలో గాడ్ ఫాదర్

మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమాను మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్
ఫిల్మ్స్ కలిసి సంయుక్తంగా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గాడ్ ఫాదర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. చిరంజీవి బర్త్ డే సందర్బంగా ఆగస్ట్ 22న విడుదల చేసిన గాడ్ ఫాదర్ టైటిల్ మోషన్ పోస్టర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో కింగ్ మేకర్ పాత్రలో చిరంజీవి కనిపించబోతోన్నారు.

మెగాస్టార్ సినిమా అంటే అభిమానులకు ఎలాంటి అంచనాలుంటాయో తెలిసిన దర్శకుడిగా మోహన్ రాజా.. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాను మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశారు. ఈ మూవీ షూటింగ్ గత నెలలో హైద్రాబాద్‌లో ప్రారంభమైంది. ఆ షెడ్యూల్ లో మెగాస్టార్ మీద యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కించారు.

తాజాగా ఈ మూవీ కొత్త షెడ్యూల్ ఊటీలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, ఇతర ముఖ్య తారాగణం మీద కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.