లవ్ స్టోరీ ఫస్ట్ డే కలెక్షన్

అంతా ఊహించినట్టుగానే లవ్ స్టోరీ సినిమా మొదటిరోజు అదరగొట్టింది. విడుదలకు వారం రోజుల ముందునుంచే అడ్వాన్స్ బుకింగ్ ఊపందుకోవడంతో, తొలిరోజు ఈ సినిమాకు మంచి కలెక్షన్ వస్తుందని అంతా ఊహించారు. అనుకున్నట్టుగానే లవ్ స్టోరీకి వరల్డ్ వైడ్ ఫస్ట్ డే 9 కోట్ల రూపాయల షేర్ వచ్చింది.

శుక్రవారం థియేటర్లలోకొచ్చిన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఏకంగా 6.78 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ స్థాయి వసూళ్లు అంటే చాలా ఎక్కువ. ఎందుకంటే, తెలంగాణలో వందశాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చినప్పటికీ జనాలు పెద్దగా రావడం లేదు. ఏపీలో వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతి లేదు. కేవలం 50శాతం ఆక్యుపెన్సీతో, అది కూడా సెకెండ్ షో లేకుండా సినిమాలు ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో లవ్ స్టోరీకి ఈ స్థాయిలో వసూళ్లు వచ్చాయంటే అది చాలా పెద్ద ఎమౌంట్ కింద లెక్క.

ఇక నాగచైతన్య కెరీర్ విషయానికొస్తే.. అతడి కెరీర్ లో ఇప్పటివరకు బిగ్గెస్ట్ ఓపెనర్ శైలజారెడ్డి అల్లుడు
మాత్రమే. ఇప్పుడా సినిమా రికార్డ్ ను లవ్ స్టోరీ అధిగమించింది. చైతూకు ఓ మంచి సక్సెస్ తెచ్చిపెట్టింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు తొలి రోజు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 3.01 కోట్లు
సీడెడ్ – రూ. 1 కోటి
ఉత్తరాంధ్ర – రూ. 60 లక్షలు
గుంటూరు – 59 లక్షలు
ఈస్ట్ – 45 లక్షలు
వెస్ట్ – 55 లక్షలు
కృష్ణా – 32 లక్షలు
నెల్లూరు – 26 లక్షలు