మహేష్ బాబుతో చిట్ చాట్

బిగ్ సి సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నాడు మహేష్ బాబు. దీనికి సంబంధించిన పరిచయ
కార్యక్రమంలో మీడియాతో మాట్లాడాడు. తన వ్యక్తిగత విషయాలతో పాటు అప్ కమింగ్ ప్రాజెక్టులకు
సంబంధించి డీటెయిల్స్ ను మీడియాతో షేర్ చేసుకున్నాడు. అవేంటో చూద్దాం.

– ప్రస్తుతం సర్కారువారి పాట సినిమా చేస్తున్నాను. దాదాపు 60శాతం షూటింగ్ పూర్తయింది. అందులో కొత్త మహేష్ బాబును చూస్తారు. ఈ సినిమా మరో పోకిరి అవుతుంది.

– రాజమౌళితో సినిమా కచ్చితంగా ఉంటుంది. అది నాకొక డ్రీమ్ ప్రాజెక్ట్. త్రివిక్రమ్ తో సినిమా పూర్తయిన
తర్వాత రాజమౌళి మూవీ ఉంటుంది. ఇంతకుమించి ఆ ప్రాజెక్టుపై స్పందించలేను.

– మొబైల్స్ నేను కూడా వాడతాను. మార్కెట్లోకి కొత్త ఐఫోన్ మోడల్ వచ్చిందంటే కొంటాను. నా దృష్టిలో
మొబైల్ ఎంత అవసరమో, అంతే లగ్జరీ కూడా ఫీల్ అవుతాను. అందుకే లేటెస్ట్ మోడల్ ఎప్పుడూ
వాడుతుంటాను. అయితే మొబైల్ కు నేను అడిక్ట్ అవ్వను. షూటింగ్ టైమ్ లో పూర్తిగా పక్కనపెట్టేస్తాను.

– నా పిల్లలకు కూడా మొబైల్ కు సంబంధించి ఇదే చెబుతాను. ఇప్పటి జనరేషన్ పిల్లల్ని మొబైల్స్ కు
దూరంగా ఉంచలేం. కాకపోతే వాళ్లను కంట్రోల్ చేయొచ్చు. మా పిల్లలకు ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు మొబైల్ ఇస్తాం.

– నా కూతురు సితార చాలా యాక్టివ్. ఆమెతో కలిసి నటించాలని నాక్కూడా ఉంది. కానీ సితారకు మాత్రం
హాలీవుడ్ అంటే ఇష్టం. ఇంగ్లిష్ సినిమాలు చేస్తా నాన్న అంటుంది. ఇప్పుడు తనకు జస్ట్ 9 ఏళ్లు మాత్రమే.
పెద్దయ్యాక ఏమౌతుందో చూద్దాం.

– మొబైల్స్ లో నేను సీక్రెట్స్ ఏవీ ఉంచను. కేవలం మొబైల్స్ అనే కాదు, నా లైఫ్ లోనే సీక్రెట్స్ అనేవి నాకు ఉండవు. నాతో క్లోజ్ గా ఉండే వాళ్లకు ఆ విషయం బాగా తెలుసు.