లవ్ స్టోరీ మొదటి వారాంతం వసూళ్లు

తెలుగు రాష్ట్రాల్లో లవ్ స్టోరీ సినిమా సూపర్ హిట్టయింది. మొదటి వారాంతం ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. తాజా వసూళ్లతో ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది ఈ సినిమా. అలా 50 కోట్ల క్లబ్ లోకి చేరాడు నాగచైతన్య.

విశేషం ఏంటంటే.. నాగచైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. మొన్నటివరకు శైలజారెడ్డి
అల్లుడు సినిమా బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిస్తే… ఆ రికార్డ్ ను క్రాస్ చేయడంతో పాటు చైతూ కెరీర్ లోనే అత్యథిక వసూళ్లు సాధించే సినిమాగా రికార్డు సృష్టించబోతోంది లవ్ స్టోరీ.

అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా సూపర్ హిట్టయింది. 3 రోజుల్లో ప్రీమియర్స్ తో కలుపుకొని మిలియన్
డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన 3 రోజుల షేర్లు ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 8.90 కోట్లు
సీడెడ్ – రూ. 2.88 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.13 కోట్లు
ఈస్ట్ – రూ. 1.06 కోట్లు
వెస్ట్ – రూ. 0.96 కోట్లు
గుంటూరు – రూ. 1.13 కోట్లు
కృష్ణా – రూ. 0.87 కోట్లు
నెల్లూరు – రూ. 0.54 కోట్లు