లవ్ స్టోరీకి వర్షం దెబ్బ

నాగచైతన్య, సాయిపల్లవి కలిసి చేసిన లవ్ స్టోరీ సినిమా థియేటర్లలో క్లిక్ అయింది. మొదటి రోజు వసూళ్లు
అదిరిపోయాయి. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ కూడా సూపర్. వరల్డ్ వైడ్ 50 కోట్ల గ్రాస్ దాటేసింది. అన్నీ మంచి
శకునములే అనుకుంటున్న టైమ్ లో లవ్ స్టోరీకి ప్రకృతి అడ్డుకట్ట వేసింది.

తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన గులాబ్ తుపాన్, లవ్ స్టోరీ వసూళ్లపై పెను ప్రభావం చూపించింది. మరీ
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమా వసూళ్లు 2 రోజులుగా గణనీయంగా తగ్గిపోయాయి. ఇప్పటికే రాష్ట్రంలో సెకెండ్ షోలు లేవు. తుపాను ప్రభావంతో ఈవెనింగ్ షోలపై కూడా ప్రభావం పడడం, 50శాతం ఆక్యుపెన్సీ కావడంతో వసూళ్లు దారుణంగా పడిపోయాయి.

ఇటు తెలంగాణలో కూడా దాదాపు పరిస్థితి అలానే ఉంది. హైదరాబాద్ లో సెకెండ్ షోలు ఫుల్ అవ్వడం లేదు. ఆరెంజ్ ఎలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో కూడా ఆక్యుపెన్సీ పడిపోయింది.

మరో 2 రోజుల్లో లవ్ స్టోరీ సినిమా మళ్లీ ఊపందుకునే అవకాశాలున్నాయి. ఈ మేరకు ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించేందుకు, యూనిట్ మరోసారి ప్రచారం చేయాలని అనుకుంటోంది. సాయిపల్లవి, నాగచైతన్యతో ఇంకోసారి మీడియాకు ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తోంది.