తమన్ మరో బంపర్ ఆఫర్ కొట్టేశాడు

విజయ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో సినిమా. ఇది మామూలు సినిమా కాదు. భయంకరమైన హైప్ తెచ్చిన సినిమా. తన కెరీర్ లో విజయ్ చేస్తున్న స్ట్రయిట్ తెలుగు సినిమా ఇది. ఈ సినిమాతో ఆయన తెలుగు తెరకు పరిచయమౌతుంటే.. మరోవైపు వంశీ పైడిపల్లి ఇదే సినిమాతో తమిళ్ కు దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. వీళ్లిద్దరే కాదు.. అటు దిల్ రాజు కూడా కోలీవుడ్ లో పాతుకుపోయే స్కెచ్ వేశాడు ఈ సినిమాతో.

మరి ఇంతటి ప్రతిష్టాత్మక సినిమాకు మ్యూజిక్ అందించే ఛాన్స్ ఎవరికి దక్కింది. ఇలాంటి అరుదైన
అవకాశాన్ని తమన్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. విజయ్ ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అందుకే కాస్ట్ అండ్ క్రూ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమాకు తమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేసుకున్నారని సమాచారం. ‘అల వైకుంఠపురములో’ తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు తమన్. ఆ సినిమాతో వరుస భారీ ప్రాజెక్ట్స్ ఆఫర్స్ అందుకొని ఫుల్ బిజీ అయిపోయాడు. దిల్ రాజు నిర్మించిన లేటెస్ట్ సినిమా ‘వకీల్ సాబ్’ కి కూడా తమన్ మంచి ఆల్బం ఇచ్చాడు.

సో.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తమన్ ను సెలక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఎంపికకు వంశీ పైడిపల్లి కూడా ఓకే చెప్పాడట. అయితే విజయ్ దృష్టిలో ఎవరున్నారో చూడాలి. విజయ్ కు అనిరుధ్ పై సాఫ్ట్ కార్నర్ ఉంది. మాస్టర్ సినిమాలో పాటలన్నీ హిట్. ఈ నేపథ్యంలో.. విజయ్ తమన్ కు ఓకే చెబుతాడా లేక అనిరుధ్ కు మరో ఛాన్స్ ఇస్తాడా అనేది చూడాలి