వరుణ్ డాక్టర్ వస్తున్నాడు

అనగనగా ఓ డాక్టర్… అతని పేరు వరుణ్! అతనికి ఓ కుటుంబం ఉంది. అయితే, అది సొంత కుటుంబం కాదు. అందరూ కలిసి కుటుంబంలా నటిస్తూ, కిడ్నాప్ లు చేస్తుంటారు. హ్యూమన్ ట్రాఫికింగ్ (అమ్మాయిల అక్రమ రవాణా)కు, డాక్టర్ చేయించే కిడ్నాప్ లకు సంబంధం ఏమిటి? వైద్యం చేయాల్సిన డాక్టర్ గన్ పట్టి హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియాలోకి ఎందుకు వచ్చాడు? దాన్ని ఎలా అరికట్టాడు? అనేది తెలియాలంటే విజయదశమి కానుకగా విడుదలవుతున్న ‘వరుణ్ డాక్టర్’ చిత్రాన్ని థియేటర్లలో చూడాల్సిందే.

‘రెమో’, ‘సీమ రాజా’, ‘శక్తి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్.
హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో ఆయన హీరోగా నటించిన చిత్రం ‘వరుణ్ డాక్టర్’. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ ‘బీస్ట్’ దర్శకత్వం వహిస్తున్న నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన చిత్రమిది.

విజయదశమి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ 9న ‘డాక్టర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగులో దీనికి వరుణ్ డాక్టర్ అనే పేరుపెట్టారు. ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు.‌ దానికి ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది.

‘వాన’ సినిమాలో హీరోగా నటించిన వినయ్, ‘డాక్టర్’లో ప్రతినాయకుడిగా నటించారు. అలాగే, ‘గ్యాంగ్ లీడర్’తో తెలుగు పరిశ్రమకు కథానాయికగా పరిచయమైన ప్రియాంక అరుల్ మోహన్… శివ కార్తికేయన్ సరసన హీరోయిన్ గా నటించింది. అనిరుధ్ సంగీతం అందించాడు.